త్వరలో గాడిద పాల డెయిరీ..లీటర్ ధర రూ.7 వేలు..!

ఇప్పటి వరకు మనం ఆవు, గేదె పాల డెయిరీలను చూశాం. అయితే త్వరలో  దేశంలో మొదటిసారిగా గాడిదపాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. హర్యానాలోని హిసార్ లో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్ఆర్సీఇ) ప్రారంభించబోతోంది. హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో ఈ డెయిరీ ఏర్పాటు చేయనుంది. 

ఈ గాడిద పాల ధర లీటర్ రూ.2 వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది. ఈ గాడిద పాలు మనుషులకు మేలు చేయడమే కాదు, మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ పాలను ఎక్కువగా ఔషధాల్లో వినియోగిస్తారు. క్యాన్సర్, ఊబకాయం, అలెర్జీలు వంటి వ్యాధులపై పోరాడే సామర్థ్యం ఉన్నందున ఈ గాడిద జాతిని ఔషధాల నిధిగా పరిగణిస్తారు. 

 

Leave a Comment