భలే బుక్కయ్యాడు.. ఏటీఎం మిషన్ లో ఇరుక్కున్న దొంగ..!

ఏటీఎంలో దొంగతనాలు సాధారణం.. కానీ ఈ దొంగ మాత్రం కొంచెం వెరైటీగా ప్రయత్నించాడు. ఏటీెఎంలో దూరి డబ్బులు దొంగతనం చేయాలనుకున్నాడు. చివరికి ఏటీఎంలో ఇరుక్కుని పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

మోహనూర్ అనే ప్రాంతానికి సమీపంలోని అనియాపురంలో ఉన్న ఓ ఏటీఎం సెంటర్ లో ఆ దొంగ దూరాడు. ఏటీెఎం మిషన్ లో ఉన్న డబ్బును దోచుకోవడానికి తెగ ప్రయత్నించాడు. చివరికి ఏటీఎం మిషనల్ లో వెనక నుంచి ఇరుక్కుపోయాడు. ఏటూ కదల్లేక అలాగే మిషన్ లో ఇరుక్కుపోయి ఉన్నాడు. 

అర్ధరాత్రి పూట ఏటీఎం సెంటర్ నుంచి శబ్దాలు వినిపించడంతో అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ దొంగను ఏటీఎం మిషన్ లో నుంచి బయటికి తీసి అరెస్టు చేశారు. నిందితుడు బారల్లి అనే ప్రాంతంలో కోళ్ల ఫామ్ లో వర్కర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి స్వస్థలం బీహార్ అని వెల్లడించారు. 

Leave a Comment