మూడ్ ను రొమాంటిక్ గా మార్చే ‘సెక్స్ కాఫీ’..!

‘సెక్స్ కాఫీ’.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. కానీ త్వరలో వింటరు.. ఎందుకంటే 2022లో ఈ సరికొత్త కాఫీ ట్రెండ్ అవ్వబోతోంది.. ఇది మీ మూడ్ ను రొమాంటిక్ గా మార్చేస్తుందట.. అమెరికాలో తయారైన ఈ కాఫీ త్వరలో మన మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కామోద్దీపన సమ్మేళనంగా ఈ ‘సెక్స్ కాఫీ’కి పేరుంది.. 

ఈ సెక్స్ కాఫీలో కోకో, దాల్చిన చెక్కతో పాటు మకా అనే ఒక పదార్థాన్ని కలిపి తయారు చేస్తారు. ఒక చెంచా పచ్చి కోకో పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ తేనే, అర టీస్పూన్ దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ మకా పౌడర్ వేసి నీటిలో మరిగిస్తే ‘సెక్స్ కాఫీ’ సిద్ధమవుతుంది. 

ఈ కాఫీలో వేసే మకా అనే పదార్థం ఒక కామోద్దీపన ఆహారం.. ఇది దక్షిన అమెరికాలో లభిస్తుంది. దీన్ని జింక్, సెలీనియం, విటమిన్ బి9, అయోడిన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో కలిపి తయారు చేస్తారు.  ముఖ్యంగా పెరువియాలో పండించే బ్రాసికా అనే మొక్క సారంతో దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థం టెస్టోస్టెరాన్ స్థాయిలను, సెక్స్ డ్రైవ్ ని పెంచుతుందని పెరువియన్ల నమ్మకం.. అయితే ఈ మకా పౌడర్ అనే మన దేశంలో లభిస్తుందో లేదో తెలియదు..  

 

Leave a Comment