కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు.. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల నిర్వాకం..!

కడుపు నొప్పితో వచ్చిన రోగిపై వరంగల్ ఎంజీఎం డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆపరేషన్ చేసి కోడుపులో కత్తురను మర్చిపోయారు. ఆపరేషన్ చేసినా కడుపు నొప్పి ఎక్కవగా వస్తుంది. దీంతో మరోసారి ఆస్పత్రికి వచ్చాడు. ఎక్స్ రే తీయడంతో డాక్టర్ల నిర్లక్ష్యం బయడపడింది.  

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం(55) గత కొద్ది రోజులుగా అల్సర్ తో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు 6 నెలల కింత అతనికి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో డాక్టర్లు అతని కడుపులో కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు. 

కొన్ని రోజులకు అతడికి కడుపునొప్పి ఎక్కువైంది. దీంతో మరోసారి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్లర్లు అతనికి స్కానింగ్ తీయించగా కడుపులో కత్తెర ఉందని తేలింది.  దీంతో డాక్టర్లు ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. బాధితుడు నిలదీయగా గుట్టుగా ఆపరేషన్ చేస్తామని చెప్పి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయడంతో ఈ విషయం బైటకు వచ్చింది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యలు ఆందోళనకు చేశారు. 

Leave a Comment