దురద ఉందని జేసీబీతో వీపును గోకించుకున్నాడు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నవ్వు తెప్పిస్తోంది.. ఓ పెద్దాయనకు వీపులో దురదగా అనిపించింది. మొదటగా తువ్వాలుతో గోక్కున్నాడు. తర్వాత నడుచుకుంటూ పక్కనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లి కిందకు వంగాడు. మెషీన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి అతని వీపుపై అటు ఇటు కదిలిస్తూ గోకాడు. దీనికి సంబంధించిన వీడియోను కేరళకు చెందిన ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఈ పెద్దాయన మామూలోడు కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే దానిని సాహసమే అని చెప్పొచ్చు. ఏ మాత్రం తప్పు జరిగినా ఆ పెద్దాయన నడుపు విరుగుతుంది.. 

Leave a Comment