బెజవాడలో ప్రేమోన్మాది ఘాతకం.. ప్రేమించడం లేదని యువతిపై దాడి, హత్య..

బెజవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదని యువతిపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తాను కత్తితో గాయపరుచుకున్నాడు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురంకు చెందిన దివ్వ తేజస్విని ఇంజినీరింగ్ చదువుతోంది. అదేప్రాంతంలో పెయింటర్ గా పనిచేస్తున్న చిన్న స్వామి అనే వ్యక్తి కొంత కాలంగా పేమ పేరుతో వేధిస్తున్నాడు. 

ఆ యువతి స్వామి ప్రేమను నిరాకరించింది. దీంతో స్వామి యువతిపై కక్ష గట్టాడు. గురువారం తేజస్విని ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దాడి తర్వాత స్వామి తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment