వైద్యం కోసం వెళ్తే.. కోరిక తీర్చమన్నాడు..!

వైద్యుడంటే దేవుడితో సమానం అంటారు.. అలాంటి వైద్యుడే కీచకుడిగా మారాడు. తన వద్ద వైద్యం కోసం వచ్చిన ఓ దళిత మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకంది. వివరాల మేరకు .. కంచికచర్లకు చెందిన ప్రముఖ ఎముకల వైద్యుడు విజయవాడలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. 

ఈనెల 7న కంచికచర్ల మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ దళిత మహిళ ఎముకలకు సంబంధించిన సమస్యతో వైద్యం కోసం డాక్టర్ వద్దకు వెళ్లింది. తన వద్ద వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆమెను కులం పేరుతో దూహించాడు. 

బాధితురాలు నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుడిని అరెస్టు చేశారు. అనంతరం కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 41 నోటీసు జారీ చేసి ఆ వైద్యుడిని విడుదల చేశారు. 

 

Leave a Comment