రూ.10 లక్షలు డొనేట్ చేసిన బిగ్ బాస్ ఫేం సోహైల్..

బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రయాలకు ఖర్చు చేస్తానని సయ్యద్ సోహైల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా తాను చెప్పినట్లే రూ.10 లక్షలను డొనేట్ చేశారు సోహైల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు. 

రూ.10 లక్షలను చెక్కుల రూపంలో మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం(నేరేడ్ మెట్), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సోషల్ ఆర్గనైజేషన్(ఆర్టీసీ క్రాస్ రోడ్), జామియా మహదుల్ అష్రాప్(విజయవాడ) సేవశ్రమాలతో పాటు మహ్మద్ మొయినుద్దీన్ కుటుంబానికి పంచారు. 

అలాగే చౌటప్పల్ లోని అమ్మానాన్న అనాథాశ్రయానికి రూ.2 లక్షల చెక్కును ఇచ్చారు. అనంతరం ఆశ్రమంలోనే కొద్ది సేపు గడిపారు. ఆశ్రమంలో వారికి భోజనం వడ్డించారు. ఇకపై తాను నటించే ప్రతి చిత్రంలోను వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని ఈ సందర్భంగా సోహైల్ ప్రకటించారు.  

 

Leave a Comment