Viral Video : సాహాసానికి చీర అడ్డుకాదు.. చీరకట్టులో జిమ్నాస్టిక్ విన్యాసాలు..!

చీర కట్టుకుని మాములు పనులు చేసుకోవాలంటేనే మహిళలకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ మహిళ జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసింది. చీరకట్టులో అతి సునాయసంగా పల్టీలు కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరియానలోని అంబాలాకు చెందిన పారుల్ అరోరా నేషనల్ మెడలిస్ట్..

ఆమె 14 ఏళ్లుగా జిమ్నాస్టిక్ లో శిక్షణ తీసుకుంటోంది. చిన్నతనం నుంచి అందిరిలా కాకుండా కాస్త కొత్తగా క్రియేటీవ్ గా ఆలోచించడం పారుల్ కు అలవాడు. ఇదే ఆమెను జిమ్నాస్టిక్ లో ఆరితేరేలా చేసింది. ఈక్రమంలో ఇటీవల చీరకట్టులో శరీరాన్ని విల్లులా వంచుతూ అలవోకగా విన్యాసాన్ని చేసింది. ఆమె చీరకట్లులో చేసిన అద్భుతమైన విన్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.   

 

Leave a Comment