చిరంజీవిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా?

కరోనా మహమ్మారి దాదాపు అన్ని పరిశ్రమలను దెబ్బతీసింది. అందులో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. కరోనా లాక్ డౌన్ లో దాదాపు సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఇంట్లో వారికి తోడుగా ఉన్నారు. 

కాగా అప్పట్లో మన హీరోలందరూ  ‘బీ ది రియల్ మ్యాన్’ అంటూ ఒక ఛాలెంజ్ ను కొనసాగించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవికి విసిరారు. దీనికి స్వీకరించిన చిరు తాను చేసిన ఇంటి పనులను ఒక వీడియో రూపంలో తీసుకున్నారు. ఆ వీడియోలో చిరంజీవి ఇంట్లో హాల్ ను శుభ్రపరుస్తూ, పెసరట్టు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇది ప్రతిరోజు చేసే పనినే, ఈ వీడియోనే సాక్ష్యం అంటూ తెలిపారు. ఈ వీడియోపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిని సూపర్ ‘సార్’ అంటూ సంబోధించారు.  ఆ తర్వాత ఈ చాలెంజ్ ను చిరంజీవి రజినీకాంత్, కేటీఆర్ లకు విసిరారు. 

 

Leave a Comment