అలాంటి వారికి కోవాగ్జిన్ సింగిల్ డోస్ చాలు..!

మీరు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారా? అలాంటి వారికి ఐసీఎంఆర్ శుభవార్త చెప్పింది. కరోనా సోకి తగ్గిన వారికి కోవాగ్జిన్ సింగిల్ డోస్ చాలాని పేర్కొంది. కరోనా బారిన పడకుండా రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్న వారిలో వచ్చే యాంటీబాడీలు.. కరోనా సోకి ఒక్క డోసు తీసుకున్నవారిలో వచ్చే యాంటీబాడీలు సమానంగా ఉన్నట్లు తెలిపింది. 

ఈ అధ్యనం వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శనివారం వెల్లడించింది. ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వారికి బీబీవీ 152(కోవాగ్జిన్) సింగిల్ డోస్ టీకా సరిపోతుందని భావిస్తున్నట్లు ఈ అధ్యనం పేర్కొంది. 

అధ్యయనం ఎలా చేశారంటే..

హెల్త్ కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారిలో కొంత మందిని ఎంపిక చేసుకొని వారిలో డే జీరో(టీకా ఇచ్చే రోజు), తొలి డోసు తీసుకున్న తర్వాత 28వ రోజు, 56వ రోజు యాంటీవాడీ రెస్పాన్స్ ను నమోదు చేశారు. దీని కోసం కరోనా బారిన పడిన 114 మంది రక్త నమూనాలను సేకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మధ్యలో కోవాగ్జిన్ తీసుకుని ఉన్నారు. 

అంతకుముందు కోవిడ్ లేని వారిలో టీకా వల్ల వచ్చిన యాంటీబాడీలను, కోవిడ్ సోకి తగ్గిన తర్వాత సింగిల్ డోస్ తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీలను పరీశించారు. కరోనా సోకని వారు రెండు డోసులు తీసుకుంటే ఎన్ని యాంటీబాడీలు ఉన్నాయో కరోనా వచ్చి సింగిల్ డోస్ తీసుకున్న వారిలోనూ అన్ని కనిపించినట్లు అధ్యయనంలో తేలింది.  

Leave a Comment