సెప్టెంబర్ లో 12 రోజులు బ్యాంక్ సెలవులు..!

ఇక రెండు రోజుల్లో ఆగస్టు నెల ముగుస్తుంది. సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. కాగా సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కస్టమర్లు బ్యాంకులకు వెళ్లేటప్పుడు ఎప్పుడు మూతపడనున్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది.. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్  బ్యాంకులకు మొత్తం 12 రోజులు హాలీడేస్ ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.  

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యాంకులు, రీజియనల్ రూరల్ బ్యాంకులు దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచిలను మూసివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ సెలవులను మూడు కేటగిరీల్లో విభజించింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ యాక్ట ప్రకారం బ్యాంకులకు సెలవులను నిర్ధారిస్తుంది. 

సెప్టెంబర్ 2021లో దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవులు ఇవే:

సెప్టెంబర్ 5 – ఆదివారం

సెప్టెంబర్ 8 – శ్రీమంత కంకరదేవి తిథి

సెప్టెంబర్ 9- తీజ్(హరితాలిక) 

సెప్టెంబర్ 10 – గణేశ్ చతుర్థి

సెప్టెంబర్ 11 – రెండో శనివారం

సెప్టెంబర్ 12 – ఆదివారం

సెప్టెంబర్ 17 – కర్మపూజ

సెప్టెంబర్ 19 – ఆదివారం

సెప్టెంబర్ 20 – ఇంద్రజత్ర

సెప్టెంబర్ 21 – శ్రీ నారాయణ గురు సమాధి డే

సెప్టెంబర్ 25 – నాలుగో శనివారం

సెప్టెంబర్ 26 – ఆదివారం

ఆర్బీఐ ప్రకటించిన ఈ జాబితా ప్రకారం సెప్టెంబర్ నెలలో ఏడు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ ఏడు సెలవులు రాష్ట్రాల వారీగా మతపరమైన కార్యక్రమాలు, పండుగ వేడుకలపై ఆధారపడి ఉంటాయి. ఇది కాకుండా సెప్టెంబర్ నెలలో 6 వారాంత సెలవులు కూడా ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులు ఇవే..

సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలపి మొత్తం 6 రెగ్యులర్ సెలవులు ఉన్నాయి. అది కాకుండా సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి పండుగ సెలవు ఉంది. అంటే సెప్టెంబర్ నెలలో మొత్తం 7 రోజులు బ్యాంకులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయవు. ఈనెలల 10వ తేదీ వినాయక చవితి, 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 

 

Leave a Comment