దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’ సినిమా ఆగస్టు 5న విడుదలైంది.. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. రష్మిక మందాన కీలకపాత్రలో నటించారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటన్ గురువారం హైదరాబాద్ లో జరిగింది.. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఏ సినిమా ఈవెంట్ అయినా చాలా క్యాజువల్ లుక్ లో కూల్ గా కనిపించే ప్రభాస్.. ఈ ఈవెంట్ కూడా అలానే వచ్చారు. బ్లూ జీన్స్, టీ షర్ట్, తలకు క్యాప్ తో కనిపించారు. అయితే ప్రభావస్ వేసుకున్న టీ షర్ట్ చాలా సింపుల్ అనిపించినా.. దాని ధర మాత్రం చాలా ఎక్కువ.. దీనిని ప్రముఖ బ్రాండ్ అయిన డాల్స్ అండ్ గబ్బానా డిజైన్ చేసింది. ఈ టీషర్ట్ ధర అక్షరాలా రూ.20 వేలు.. దీనిని ఐదేళ్ల క్రితం కూడా ప్రభాస్ ధరించినట్లు అభిమానులు అంటున్నారు.