ఏపీ కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు.. లాటరీ పద్ధతిలో ఎంపిక..!

ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది.. 1వ తరగతిలో ప్రవేశాలపై ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం-2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.. సీట్లు మిగిలిపోతే ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేస్తారు.. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలలో 25 శాతం సీట్లలో ప్రవేశాల కోసం ఆగస్టు 10న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈనెల 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 30న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 2న మొదటి జాబిత విడుదల చేస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.. 

ఎవరు అర్హులు: 

ఈ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.120 లక్షలు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.40 లక్షలు నిర్ణయించారు.. 

రిజర్వేషన్లు:

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. 

Leave a Comment