కోహ్లీ తీసుకునే ‘బ్లాక్ వాటర్’ ధర తెలిస్తే.. షాక్ అవుతారు?

112
Kohli Black Water

టీమిండియాలో పరుగుల మిషన్ ఎవరంటే.. గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగితే పరుగుల వరద పారిస్తాడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫిట్ నెస్ విషయంలోనూ చాలా శ్రద్ధ వహిస్తాడు. క్రికెట్ లో రాణించాలంటే ఫిట్ నెస్ చాలా అవసరం.. దాని కోసం విరాట్ కోహ్లీ గంటల కొద్దీ సమాయాన్ని జిమ్ లోనే గడుపుతుంటాడు. జిమ్ లో వెయిట్లు, కార్డియోలను చేయడానికి ఆసక్తి చూపుతాడట.. వారంలో కనీసం 5 రోజుల పాటు వర్కవుట్లు చేస్తాడట. 

విరాట్ తీసుకునే డైట్:

ఇక విరాట్ కోహ్లీ డైట్ విషయానికి వస్తే.. విరాట్ తన అల్పాహారంలో ఆకుకూరలు, బ్లాక్ పెప్పర్, వెన్ను క్రమం తప్పకుండా తీసుకుంటాడట. ఉదయం ఆహారంలో కోడి గుడ్డు కచ్చితంగా ఉంటుందట.. బొప్పాయి, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్ లను రెగ్యులర్ గా తీసుకుంటాడట.. అయితే కోహ్లీ లంచ్ మాత్రం లైట్ గానే తీసుకుంటాడట. లంచ్ లో ఉడికించిన బంగాళదుంపలు, పాలకూర, ఇతర కూరగాయలు ఉండేటట్లు చూసుకుంటాడు. డిన్నర్ మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకుంటాడట.. ఇక జంక్ ఫుడ్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లడట..

నీళ్లు కూడా బ్రండెడ్:

విరాట్ కోహ్లీ నీళ్ల విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటాడు. అతడు తన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కావాల్సినంత నీటిని ప్రతిరోజూ తీసుకుంటాడు. అది కూడా ప్రపంచంలోనే బెస్ట్ బ్రాండ్ వాటర్ తాగుతాడు. కోహ్లీ మినరల్ వాటర్ కు బదులు ‘బ్లాక్ వాటర్’ని తాగుతాడట. ఈ బ్లాక్ వాటర్ లీటర్ ధర సుమారు రూ.600-రూ.3000 వరకు ఉంటుందట.. ఈ నీళ్లు ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతాయి. కరోనా ప్రారంభం నుంచి కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతున్నాడు.. ఈ బ్లాక్ వాటర్ ను కోహ్లీ మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైకా అరోరా, శ్రుతిహాసన్ ఫిట్ గా ఉండేందుకు తాగుతారు.

బ్లాక్ వాటర్ వల్ల లాభాలు:

  • ఈ నీళ్లలో సహజసిద్ధమైన ఆల్కలైన్ ఉంటుంది. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్, ఫిట్ గా ఉంటుంది. 
  • బ్లాక్ వాటర్ లో ఉండే 70 శాతం ఖనిజాలు జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందట. 
  • మనం ప్రతిరోజూ తీసుకునే నీటిలో పీహెచ్ స్థాయి 7 మాత్రమే ఉంటుంది. అదే బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువగా ఉంటుంది. 
  • అందువల్ల ఈ నీటిలో యాంటీ ఏజెంట్ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందకు తోడ్పడుతుందట….
Previous articleతిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Next articleస్మశానం లోనే అమ్మాయి” డాక్టర్ “ చదువు !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here