తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

పుష్టిగా భోజనం చేశాక వెంటనే స్నానం చేస్తుంటారు కొందరు. అయితే తిన్న వెంటనే స్నానం చేయవద్దని మన పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం మంచిది కాదని చెబుతారు. కానీ వాటిని కొందరు పట్టించుకోరు. అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల కడుపు నొప్పి మరియు అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వెచ్చని నీటితో స్నానం చేసినప్పుడు హైపర్ థెర్మిక్ యాక్షన్ అనే ప్రక్రియ శరీరంలో ప్రేరేపించబడుతుంది. దీని వల్ల అంతర్గత శరీర ఉష్ణోగ్రత ఒక డిగ్రీ లేదా రెండు డిగ్రీలు పెరుగుతుంది. 

హైపర్ థెర్మిక్ ప్రక్రియ వల్ల ప్రయోజనాలు:

  • రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది.
  • నాడీ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది.
  • విషవ్యర్థాలను బయటకు పంపడానికి చెమట గ్రంథులను ప్రేరేపిస్తుంది. 

భోజనం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత మీ జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి శరీరాన్ని నిర్దేశిస్తుంది. స్నానం చేసినప్పుడు హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. కడుపు నిండి ఉన్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీరం గందరగోళానికి గురవుతుంది. ఎందుకంటే జీర్ణవ్యవస్థను రక్త ప్రవాహం పెరగడానికి బదులుగా, శరీరం నీటి వల్ల కలిగే హెపర్ థెర్మిక్ చర్యను అనుభవిస్తుంది. సిద్ధాంతపరంగానూ ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. 

ప్రోటీన్, హెవీ ఫైబర్ ఫుడ్, కొవ్వు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో కూడాని భోజనం మీ శరీరంలో జీర్ణం కావడంలో ఉబ్బరం కలిగించవచ్చు. మీ ఛాతీపై ఒత్తిడి తెచ్చి, తిమ్మరి మరియు గెండెల్లో మంట వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పండ్ల రసం లేదా సలాడ్ తీసుకున్న తర్వాత స్నానం చేయవచ్చు. అయితే భోజనం చేసిన తర్వాత కనీసం గంట లేదా రెండు గంటల తర్వాత స్నానం చేయడం మంచిది..

 

Leave a Comment