స్మశానం లోనే అమ్మాయి” డాక్టర్ “ చదువు !!

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో రేకుల గది స్మశానం లోనిది. అందులోనే ఆన్లైన్ క్లాసులో వింటోంది ఓ వైద్య విద్యార్థి… ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా రాకపోవడం, మేడ మీదకి కోతుల బెడద. అందుకే సిగ్నల్ సరిపడా ఉన్న స్మశాన వాటిక అనే ఆన్లైన్ క్లాసులకు వేదికగా చేసుకుంది చ జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ కు చెందిన మిరియాల కల్పన. ఆమె ఎంసెట్లో 698 ర్యాంకు సాధించి 2017 లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. తమ చదువులో చక్కగా రాణిస్తున్న కల్పన.

 

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. వాళ్ళ ఊర్లో సెల్ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉండటం వల్ల, ఇంట్లో కూర్చుంటే సిగ్నల్ సమస్య అసలు ఆన్లైన్ క్లాసులు వినడం చాలా కష్టం. మేడ మీద కూర్చుంటే కోతుల బెడద అక్కడ చదువుకోవడం ఆన్లైన్ క్లాసులు వినడం అస్సలు కుదరదు. 

 

పోయిన సంవత్సరం కూడా కుటుంబ సభ్యుల సహకారంతో నిత్యం స్మశాన వాటిక నూనె ఆన్లైన్ పాఠాలు విన్నాను అంటుంది కల్పన. నాలాంటి వారి కోసం సెల్ఫోన్ సిగ్నల్స్ వచ్చేలాఅధికారులు చర్యలు తీసుకోవాలని కల్పనా కోరుతోంది.

Leave a Comment