వ్యాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా?

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈక్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ జరుగుతోంది. 18 ఏళ్ల కంటే తక్కవ వయస్సు వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. 

అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఆరు నెలల్లోనే యాంటీబాడీలు క్రమంగా తగ్గుతుంటాయని ఇటీవల బ్రిటీష్ పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ స్టడీ తేల్చంది. 

భారత్ లో వ్యాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలపై ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉన్న రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం 614 హెల్త్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. యాంటీబాడీలు తగ్గిన మాత్రాన వారిలో వ్యాధి నిరోధక శక్తి నిర్వీర్యం అయినట్లు చెప్పలేమని పేర్కొంది. ఆరు నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోస్ అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పగలమని ఆర్ఎంఆర్సీ డాక్టర్ సంగమిత్ర పతి వెల్లడించారు. భారత్ లో జరుగుతున్న వివిధ అధ్యయనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.   

Leave a Comment