మైదా పిండి దేని నుంచి తయారు చేస్తారో తెలుసా?

గోధుమ పిండి, బియ్యం పిండి, శనగ పిండి, మైదా పిండి.. ఇవన్నీ మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాలు.. అయితే గోధుమల నుంచి గోధుమ పిండి, శనగల నుంచి శనగ పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి తయారవుతాయి. మరీ మైదా పిండి ఎలా తయారు అవుతుంది? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ.. మైదా పిండి దేని నుంచి తయారు అవుతుందో చాలా మందికి తెలియదు..

ఎలా తయారు చేస్తారంటే?

బాగా పోలిష్ చేసిన గోధుమల నుంచి మైదా పిండిని తయారు చేస్తారు. పోలీష్ లో భాగంగా గోధుమల పైపొరలను చాలా వరకు తీసేస్తారు. పోషకాలు ఉండేదే పై పొరల్లో.. అలా పైపొరలు తీసేసిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా చేసేందుకు అజోడికార్బోనోమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. చివరిలో పొటాషియం బ్రోమేట్ ని కలుపుతారు. అప్పుడు మైదా చాలా స్మూత్ గా, తెల్లగా అవుతుంది.. 

దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. మైదా పిండితో రవ్వ దోసెలు, పరోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజాలు, జిలేబీలు, హల్వాలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారు చేసుకోవచ్చు. 

ఆరోగ్యానికి హానీకరం:

మైదాపిండి ఆరోగ్యానికి ఎంతో హానీకరం.. మైదాపిండితో ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలగవు. ఇది క్యాన్సర్ వంటి రోగాల కారకంగా మారే అవకాశం ఉంది. దీని తయారీలో వాడే బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇందులో వాడే బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించారు. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. మైదాపిండిని నీటిలో కలిపి గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగిస్తారు.. దీనిని నిత్యం వాడటం వల్ల మధుమేహం, గుండెజబ్లులు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, ఆడపిల్లలు శీఘ్రంగా పుష్పవతి అవ్వడం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.   

 

 

 

Leave a Comment