ఆ మాస్కులను వాడొద్దు..కేంద్ర హెచ్చరిక..!

ఎన్-95 మాస్కుల విషయంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులను వాడొద్దంటూ సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ మాస్కులు వైరస్ వ్యాప్తిని నిరోధించలేవని తెలిపింది. 

కరోనా నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ మాస్కులు వైద్య సిబ్బంది వినియోగానికి ఉద్దేశించినవని, అయితే సామాన్య ప్రజలు వీటిని అనుచిత రీతిలో వినియోగస్తున్నట్లు తెలిసిందని చెప్పింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ఇంట్లో తయారు చేసుకునే మాస్కులను వినియోగించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది. ఆ మార్గదర్శకాలను ప్రజలకు ప్రచారం చేయాలని సూచించింది. ముఖ్యంగా మాస్కులను ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాడాలని కోరింది. మాస్కులను ఎప్పటికప్పుడు కడగాలని, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రత్యేక మాస్క్ కలిగి ఉండాలని సూచించింది. 

Leave a Comment