ఆక్స్ ఫర్డ్ నుంచి గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్..!

కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, అమెరికా, చైనా, యూకే, భారత్ తో సహా పలు దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేశాయి. అవి హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.  ఈ తరుణంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. 

తాజాగా ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ తొలిదశ క్లినకల్ ట్రయల్స్ సంబంధించి సమాచారాన్ని వెల్లడించింది. లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఈ ఫలితాలను ప్రచురించారు. ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ తొలిదశ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం అయినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగిలో యాంటీబాడీస్, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడింది చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 1,077 మందిపై ప్రయోగించారు. అయితే కొందరిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపంచాయన్నారు. అయితే ఇది పూర్తిగా సురక్షితమైందన్నారు. ఈ వ్యాక్సిన్ కరోనాను పూర్తిగా నిరోధిస్తుందో లేదో తెలియాలంటే మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. 

Leave a Comment