దమ్ముంటే నిరూపించండి

కరోనాను కుల, మతాలకు అంటకట్టొద్దు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

తన వల్ల, కర్నూలు ఎంపీ వల్ల కరోనా వ్యాప్తి జరిగిందని ప్రచారం చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన మీడియా సమావేశంలో ఖండించారు. తాను తప్పుచేశానని నిరూపణ అయితే కర్నూలు సెంటర్ లో ఉరితీయాలని చెప్పారు. 

కరోనాను నియంత్రించేందుకు అందరికంటే తాను ముందున్నాన్నారు. తబ్లీగ్ జమాత్ కు వెళ్లిన వారిని 24 గంటల్లో క్వారంటైన్ కు పంపించానని తెలిపారు. ఈ విపత్తు నుంచి ఎలా బయట పడాలో చెప్పాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కరోనాతో బాధపడుతుంటే  ముస్లిం సమాజాన్ని వాడుకోవాలని కొందరు ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. 

కరోనాను కుల, మతాలకు ముడిపెట్టొద్దు..

‘భూమా అఖిలప్రియ మీ అమ్మానాన్న ముస్లిం ఓట్లతోనే గెలిచారనేది గుర్తుపెట్టుకో. కరోనా వైరస్ మహమ్మారిని ముస్లింలకు అంటగట్టద్దు. రాజకీయాలు, కులాలు, మతాలకు దీనికి ముడిపెట్టద్దు’ అని హఫీజ్ ఖాన్ అభ్యర్థించారు. 

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నంచూ కన్నా..

కరోనా కిట్లను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంటే రూ.65 తక్కువకు కొనుగోలు చేసిందని, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షడు  కన్నాలక్ష్మీనారాయణకు హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. ప్రజా ధనాన్ని కాపాడేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. 

చంద్రబాబు ఉంటే దోచుకునే వారు..

ఇదే సమయంలో  చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే మొత్తం దోచుకునే వారని విమర్శించారు. ఆయన హయాంలో జరిగిన రెండు పుష్కరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేలేదన్నారు. పుష్కరాల సమయంలో తీసిన వీడియో వల్ల ఎంతో మంది చనిపోయారని, దానిని తాము మానవత్వంతో చూశమని చెప్పారు. 

కాని ఈ రోజు కరోనా వైరస్ ముస్లింల వల్ల వ్యాప్తి చెందిందని చెప్పడం బాధాకరమని, ముస్లింలపై టీడీపీ నాయకులకు ప్రేమలేదని చెప్పారు. కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ముస్లిం సమాజాన్ని చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. 

సీఎం జగన్ కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే చంద్రబాబు, వారి ఎల్లో మీడియా, సోషల్ మీడియా, టీడీపీ రాజకీయ నిరుద్యోగులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

Leave a Comment