జియోతో ఫేస్ బుక్ భారీ డీల్

సోషల్ మీడియా దిగ్గజం Facebook రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. జియోలో 9.9 శాతం వాటాను Facebook కొనుగోలు చేసింది. జియో ప్లాట్ ఫామ్ లలో రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు Facebook ప్రకటించింది. ఫేస్ బుక్ పెట్టుబడి తర్వాత జయో ప్లాట్ ఫామ్స్ విలువ రూ.4.62 లక్షల కోట్లకు పెరుగుతుంది. 

భారతదేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లకు భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. భారత్ లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్ తో కలిసి పనిచేస్తున్నామని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు. ఇండియాలో వాణిజ్య పరంగా కొత్త అవకాశాలు కల్పించడానికి జియోతో భాగస్వామ్యం చేసుకున్నామన్నారు. 

ఈ డీల్ తో ఏమవుతుంది?

జియో ప్లాట్ ఫామ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క కంపెనీ. ఇందులో రిలయన్స్ యొక్క అన్ని డిజిటల్ వ్యాపారాలు ఉంటాయి.  ఇప్పుడు జియో ప్లాట్ ఫాం, రిలయన్స్ రిటైల్ మరియు వాట్సాప్ మధ్య కొత్ భాగస్వామ్యం ఏర్పడింది. జియో ప్లాట్ ఫామ్ ద్వారా రిలయన్స్ రిటైల్ బిజినెస్ ను డెవలప్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల వినియోగదారులు వాట్సాప్ ను ఉపయోగించి జియో మార్ట్ తో లావాదేవీలను జరపవచ్చు. తమ ఇళ్లకే ఉత్పత్తులను తెప్పించుకోవచ్చు.

ఇందు కోసం చిన్న కిరాణ స్టోర్స్ యొక్క నెటవర్క్ తయారు చేస్తారు. వాటి ఒప్పందం కుదుర్చుకుంటారు. మీకు ఏదైన వస్తువు కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ ఇస్తారు. ఇక సమీపంలో ఉన్న చిన్న కిరాణ స్టోర్ యజమాని మీకు వస్తువులను అందజేస్తాడు. ఇక్కడ వాట్సాప్ ద్వారా పేమెంట్, మార్కెటింగ్ అన్ని జరుగుతాయి. చిన్ని చిన్న కిరాణ షాపులతో తమతో జోడించి ఒక పెద్ద బజార్ ను తయారు చేసే పనిలో జియో ప్లాట్ ఫాం ఉంది.  

 

Leave a Comment