‘సమంత చైతుకు విడాకులు ఇచ్చేయ్..మనం పెళ్లి చేసుకుందాం’

సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లు, బిజినెస్ పరంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా ఆమె పలు రంగాల్లో రాణిస్తోంది. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటారు. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈక్రమంలో సమంత ‘ఫీలింగ్ గుడ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఈ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘చైతన్యకి విడాకులు ఇచ్చేయ్..మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చూసిన సమంత తన దైన స్టయిల్ లో సమాధానమిచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అది కష్టం.. ఓ పని చేయ్.. చైతూని నువ్వే అడుగు’ అంటూ సమంత రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ గా మారింది.    

 

View this post on Instagram

 

☀️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Leave a Comment