కరోనా వ్యాక్సిన్ కనుగొంది నా వల్లే : చంద్రబాబు

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తన ఖాతాలో వేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు భారత్ బయోటెక్ తయారు చేసే కరోనా వ్యాక్సిన్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ కనుగొన్నందుకు భారత్ బయోటెక్ వారిని అభినందించానని, తాను చూపిన చొరవతోనే బయోటెక్ పార్క్ ఏర్పాటైందని  వారు చెప్పారని అన్నారు. ఇది విని చాలా గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. 

విజయసాయిరెడ్డి కౌంటర్..

కరోనా వ్యాక్సిన్ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ కు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడు. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట. మైండ్ జనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే’ అంటూ తనదైన శైలిలో విమర్శించారు. 

Leave a Comment