ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకుంటునారా?

వాతావరణం చల్లగా ఉంటే చాలు.. తెలియకుండానే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తుంటాం.. ఈ సమయంలో చాలా మంది మూత్రాన్ని ఆపేసుకుంటారు. ఉన్న ప్రాంతంలో టాయిలెట్ లేక.. లేదా ఇతర సమస్యల కారణంగా చాలా మంది మూత్రాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అలా ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ.. అది అలవాటుగా మారితే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు వైద్య నిపుణులు.. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేమిటో ఇప్పుడు చూద్దాం..

మూత్రాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల నష్టాలు:

  • ఇది మూత్రాశయ కండరాలను బలహీనపరుస్తుంది. మూత్రం సాధారణ ప్రవాహంలో సమస్యలు కలిగిస్తుంది. ఉదాహరణకు వయసు పెరిగినా కొన్నిసార్లు తెలియకుండానే మూత్రం పోవచ్చు.
  • మూత్రవిసర్జన సరైన టైంలో వెళ్లకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
  • ఎక్కువ సేపు మూత్రవిసర్జనకు వెళ్లకపోతే.. మూత్రనాళంలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఈ అలవాటును మార్చుకోకపోతే కిడ్నీలు పాడవుతాయి.
  • మూత్రవిసర్జనను ఎక్కువ సేపు కంట్రోల్ చేసుకోవడం వల్ల మూత్రాశయం సాధారణ విస్తరణను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రాశయం విస్తరిస్తుంది. మరలా అది సాధారణ స్థితికి చేరుకోదు. ఇది భవిష్యత్తులో చాలా సమస్యలు కలిగిస్తుంది.
  • కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. 

Leave a Comment