8 కిలోల సమోసా తినగలరా?.. 30 నిమిషాల్లో తింటే రూ.51 వేలు..!

మన దేశంలో ప్రధానమైన స్నాక్ ఏదంటే అది సమోసా.. సాయంత్రం వేళ స్నాక్స్ రూపంలో సమోసాలు తింటారు.. ఇక వర్ష కాలంలో అయితే సమోసాకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ బేకరి మాత్రం సమోసా ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరింది. 30 నిమిషాల్లో ఓ భారీ సమోసాను మొత్తం తింటే రూ.51,000 నగదు బహుమతిని ప్రకటించింది.. మరీ ఆ ఛాలెంజ్ ఏంటో చూద్దాం.. 

మీరట్ లోని లాల్ కుర్తి బజార్ లో ‘కౌశల్ స్వీట్స్’ పేరుతో ఓ స్వీట్ షాప్ ఉంది. ఆ షాప్ యజమాని పేరు శుభమ్ కౌశల్. ఆ షాపులో వెరైటీల సమోసాలతో పాటు స్వీట్స్, పకోడీలు బాగా ఫేమస్.. అయితే తమ షాపులోని సమోసాకు దేశవ్యాప్తంగా పేరు రావాలని అనుకున్నాడు. అందుకోసం కొత్తగా చేయాలని ఆలోచన చేశాడు.. 

ఈక్రమంలో అతడికి ఓ ఐడియా వచ్చింది. ముందుగా 4 కిలోల సమోసా చేసి ఫుడ్ ఛాలెంజ్ పెట్టాడు. ఆ సమోసా తింటే రూ.11వేలు బహుమతి ప్రకటించాడు.  అది చాలా ఫేమస్ అయ్యింది. దీంతో ఈసారి 8కిలోల సమోసాతో ముందుకొచ్చాడు.. దానికి ‘బాహుబలి సమోసా’ అని పేరు పెట్టాడు. ఎవరైనా ఈ బాహుబలి సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.51 వేలు ఇస్తానని ప్రకటించాడు. 

అయితే ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్ లో ఎవరూ గెలవలేకపోయారని కౌశల్ అన్నారు. ఈ 8 కిలోల సమోసా ధర రూ.1100 ఉంటుందన్నారు. ఈ సమోసాలో బంగాళదుంపలు, బఠానీలు, కాటేజ్ చీజ్, డ్రైఫ్రూట్స్ ఉంటాయన్నారు. త్వరలో 10 కిలోల సమోసా చేస్తానని తెలిపారు. 

  

Leave a Comment