రెండో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు.. 

సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని వ్యక్తి దిల్ రాజు.. నిర్మాతగా ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను నిర్మించాడు. నిర్మాతగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయిన దిల్ రాజు ఏ పని చేసిన దానికి ఓ స్పెషల్ ఉంటుంది.

 ప్రతి మనిషికి జీవితంలో తప్పనిసరిగా ఓ తోడు ఉండాలి.  ఆ తోడు నీడలా ఉండి ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది.  దిల్ రాజు జీవితంలో ఆ తోడుని మధ్యలోనే దేవుడు తనతో తీసుకుపోయాడు.  దిల్ రాజు ఒంటరివాడయ్యాడు.  

అయితే, జీవితంలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం.  అది గమనించిన దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నాన్నకు ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంది.  బరువైన ఆ బాధ్యతను భుజాన వేసుకొని పెళ్లి పెద్దగా వ్యవహరిస్తోంది.  మాతృ దినోత్సవం రోజున తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తోంది.  తనకు మరో తల్లిని తెచ్చుకుంటోంది హర్షిత రెడ్డి.   దిల్ రాజు మరో పెళ్లి చేసుకోబోతున్న్నాడు అనే వార్తలు చాల రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నా దానిపై రాజు పెద్దగా స్పందించలేదు.  

ఆ వార్తలు ఈ రోజు నిజం అయ్యాయి.  దిల్ రాజు సొంత గ్రామమైన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో రాజు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.  ఈరోజు రాత్రి  తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వర స్వామీ దేవాలయంలో అతికొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారు దిల్ రాజు.  మాతృదినోత్సవం రోజున దిల్ రాజు మరో కొత్తజీవితం ప్రారంభించబోతున్నారు.

 

Leave a Comment