రేపటి నుంచి ఆన్ లైన్ లో  GATE కోచింగ్

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉచిత Online GATE కోచింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడు, యోగి వేమన విశ్వవిద్యాలయం కడప ఆధ్వర్యంలో గేట్ ఆన్ లైన్ కోచింగ్ ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్వహించునుంది. 

కోచింగ్ సెషన్ దశల వారీగా నిర్వహించబడుతుంది. వీటిలో మొదటి దశ మే 11న ప్రారంభమై మే 22న ముగుస్తుంది. ఉచిత తరగతులకు హాజరు కావడనికి నమోదు చేసుకున్న విద్యార్థులు APSCHE  వెబ్ సైట్ నుంచి షెడ్యూల్ ను చూసుకోవచ్చు. 

గేట్ తరగతుల కోసం జేఎన్టీయూ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో క్లాస్ టైమింగ్ షెడ్యూల్ కు ఒక రోజు ముందు విద్యార్థులు యూట్యూబ్ ద్వారా క్లాసులకు హాజరువావచ్చు. లింక్ ను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు ప్రతి రోజు వారి రోల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. 

 GATE 2020 యొక్క పూర్తి సిలబస్ 12 సెషన్లలో బోధించబడుతుంది. విద్యార్థులు కోచింగ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు సెషన్ లో చేరాలని ఉన్నత విద్యామండలి సూచించింది. క్లాసులు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ మోడ్ లో జరుగుతాయి కాబట్టి, విద్యార్థులు తమ సందేహాలను చాటింగ్ ద్వారా అడగవచ్చు. 

Leave a Comment