రకుల్ సర్జరీ వికటించిందా.. అకస్మాత్తుగా ఎందుకీ మార్పు?

అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ తన ఫిట్ నెస్ కోసం ఎంతో కష్టపడుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఈమే రకుల్ ఏనా అంటూ షాక్ అవుతున్నారు.. తాజాగా రకుల్ తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెదాలకు సర్జరీ చేసుకుందని సమాచారం..

ఇప్పటికే ఫిట్ నెస్ పేరుతో ఇప్పటికే ఉన్న అందాన్ని పోగొట్టుకున్న రకుల్ మరోసారి సర్జరీతో మరింత దారుణంగా తయారైందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సర్జరీ వికటించడంతోనే రకుల్ ఇలా మారిపోయిందని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రకుల్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా తయారైందంటూ పలువురు ఆమె పాత ఫొటోలను పోల్చి చూస్తున్నారు. మొత్తానికి రకుల్ న్యూలుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.    

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Leave a Comment