బాహుబలితో గుర్తింపు రాలేదు.. సార్పట్టతో వచ్చింది : జాన్ కొక్కెన్

వెండితెరపై ‘బాహుబలి’ సినిమా ఓ అద్భుతం.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇండియన్ సినిమా అంటే ఇది.. అని చెప్పుకునేలా చేసింది. ఈ సినిమాలో ఎంతో మంది గుర్తింపు పొందిన నటులు నటించారు. కాని వారిలో కొందరికి మాత్రమే మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నటులకు అసలు గుర్తింపు రాలేదు. అసలు ఈ నటుడు బాహుబలి సినిమాలో ఉన్నాడా అన్న సందేహం వచ్చేలా ఉన్నారు. అలాంటి వారిలో ‘జాన్ కొక్కెన్’ కూడా ఒకరు.. 

కానీ ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలై మంచి హిట్ సాధించిన చిత్రం ‘సార్పట్ట’.. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాను పా.రంజిత్ తెరకెక్కిచాడు. ఈ సినిమాలో జాన్ కొక్కెన్ వెంబులి(వేటపులి) పాత్రలో నటించాడు. ఈ చిత్రం జాన్ కొక్కెన్ కు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఈనేపథ్యంలో జాన్ కొక్కెన్ బాహుబలిలో తన పాత్రను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. బాహుబలి సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేశానని, ఆ సమయానికి తన పేరు కూడా ఎవరికి తెలియదని జాన్ కొక్కెన్ పేర్కొన్నాడు. అయితే ఏదో ఓ రోజు తనకు మంచి గుర్తింపు వస్తుందని అనుకున్నానని, ఆ గుర్తింపు ఇప్పటికి వచ్చిందని తెలిపాడు. అందుకే బాహుబలి సినిమాలోని తన పాత్ర ఫొటోను ఇప్పుడు గర్వంగా షేర్ చేస్తున్నానని అన్నాడు. ఏదో ఓ రోజు తనను అందరూ గుర్తించే స్థాయికి ఎదుగుతానని అజిత్ సార్ చెప్పారని, ఆ రోజు ఇప్పుడొచ్చిందని జాన్ కొక్కెన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 

కాగా శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా ద్వారా జాన్ కొక్కెన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో ‘ఎవడు’, ‘వన్ నేనొక్కడినే’, వీరుడొక్కడుతో పాటు కేజీఎఫ్ సినిమాల్లో నటించాడు. బాహుబలిలో చిన్న పాత్ర చేశాడు. కానీ జాన్ కొక్కెన్ కు  ‘సార్పట్ట’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

 

View this post on Instagram

 

A post shared by John Kokken (@highonkokken)

Leave a Comment