VD అభిమానులకు ట్రీట్..  ‘అర్జున్ రెడ్డి’ నుంచి డిలీట్ సీన్..!

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసందే.. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సీన్స్ కట్ చేశారు. 2017, ఆగస్టు 25న వచ్చిన ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు అర్జున్ రెడ్డి టీమ్ ట్రీట్ అందించింది. అర్జున్ రెడ్డి నుంచి డిలీట్ చేసిన సీన్ ను రిలీజ్ చేసింది. 2.53 నిమిషాలు ఉన్న ఈ సీన్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ డిలీట్ సీన్ యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది. 

ఇక ఈ సీన్ లో విజయ్ దేవరకొండ, రాహు రామక్రిష్ణ మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ షాలినీ పాండే కోసం హీరో ఆమె ఇంటికి వెళ్లి ముద్దు పెట్టుకున్నప్పుడు.. హీరోయిన్ వాళ్ల నాన్న చూస్తాడు.. అప్పుడు విజయ్ దేవరకొండతో హీరోయిన్ నాన్న గొడవపడతాడు. ఈ ఘటనపై ఇద్దరు చర్చించుకుంటున్నారు. ప్రీతిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే వాళ్ల నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడని విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ తో చెప్పడం ఈ సీన్ లో చూడవచ్చు. 

Leave a Comment