వామ్మో.. 110 అడుగుల జుట్టు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మహిళ..!

సాధారణంగా జుట్టు 2 లేదా 3 అడుగులు ఉంటుంది.. మరీ పెద్దగా అంటే 4 అడుగులు ఉంటుంది.. కానీ ఓ మహిళకు మాత్రం 110 అడుగులు జుట్టు ఉంది. ఇంత పొడవైన జుట్టుతో ఆ మహిళ గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు ఆ మహిళ ఏకంగా 40 ఏళ్లుగా జుట్టును పెంచుతుందట.. ఫ్లోరిడాకు చెందిన భారత సంతతి మహిళ ఆశా మండేలా.. 2009లోనూ 19 అడుగుల పొడవైన జుట్టుతో గిన్సీస్ రికార్డు క్రియేట్ చేసింది.. మళ్లీ 14 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే బద్దలు కొట్టింది.. ఏకంగా 110 అడుగుల పొడవైన జుట్టుతో రికార్డు సృష్టించింది. 

అంత పొడవైన జుట్టును మెయిన్ టైన్ చేయాలంటే ఎంతో కష్టమట.. ఆమె తలస్నానం చేయడానికి 6 బాటిల్స్‌ షాంపూ పడుతుందట. ఇక తల ఆరడానికి రెండు రోజుల సమయం పడుతుందట. ఇన్ని ఇబ్బందులతో అంత పొడవైన జుట్టుని పెంచుకోవడం అవసరమా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ..ఆ జట్టు వల్లే తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. అందుకే ఎంత రిస్క్‌ అయినా సరే జుట్టు పెంచుకోవడానికే సిద్ధపడుతున్నాని ఆమె చెబుతున్నారు. ఆ ముడులను డ్రెడ్ గా పిలవడానికి ఆమె ఇష్టపడదు.. అది తన కిరీటమని చెబుతుంది..

Leave a Comment