తోటి విద్యార్థిని గొంతు నులిమి చంపేసిన ప్రేమోన్మాది..!

మాట్లాడి రమ్మంటూ తోటి విద్యార్థిని బయటకు తీసుకెళ్లిన సహ విద్యార్థి ఆమెతో గొడవపడి కొట్టి, గొంతునులిమి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం చోటుచేసుకుంది. తాను ప్రేమిస్తున్న ఆమె మరెవరితోనో మాట్లాడుతోందన్న అనుమానంతో ఈ ఘతుకానికి పాల్పడినట్లు తెలిసింది. 

పోలీసులు తెలిపిని వివరాల మేరకు ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోటా అనూష నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా అదే కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డితో పరియం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

 ఈ క్రమంలో మాట్లాడాలి రమ్మంటూ బుధవారం ఉదయం అనూషను క్లాస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి బయటకు తీసుకెళ్లాడు. పాలపాడు రోడ్డులోని సాగర్ కాలువ వద్దకు వెళ్లాక ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరో విద్యార్థితో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత అనూషపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అనూష మృతదేహాన్ని కాలువలోకి తోసేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే కాలువలో అనూష  మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. 

 మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనూష కాలేజీ ఐడీ కార్డును గుర్తించి దాని ఆధారంగా సంబంధిత కాలేజీలో విచారణ చేపట్టారు.  మృతురాలు అనూషగా గుర్తించిన పోలీసులు తోటి విద్యార్థులను విచారించగా.. ఉదయం విష్ణు బైక్ పై ఆమెను బయటకు తీసుకెళ్లినట్లుగా చెప్పారు. 

ఆ తర్వాత విష్ణు నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు విష్ణు వర్ధన్ రెడ్డి ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రమే కారణంగానే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

 

  

Leave a Comment