పెట్రో ధరలపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..!

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పెరుగుదలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మండుతున్న పెట్రో ధరలపై ప్రభుత్వాలు సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. పెట్రో ధరల పెరుగుదల కార్లు, బైక్ లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 

తయారీ, రవాణా రంగాలను అధిక ధరలు తీవ్రంగా దెబ్బతీస్తాయని, ఇది వ్యాపూార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో రాష్ట్రానికి, దేశానికి డబ్బులు చాలా అవసరమని, అయితే రేట్ల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం మీద పడుతుందని అన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. 

Leave a Comment