ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపాన నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో మద్య దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 33 శాతం మద్యం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

గతంలోనే 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం, తాజాగా 13 శాతం షాపులు తగ్గిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 4380 నుంచి 2934కు తగ్గనున్నాయి. ఈనెలాఖరు లోపు 13 శాతం దుకాణాలను తొలగించాలని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులను ప్రభుత్వం తొలగించింది. 

ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మద్యం మహమ్మారిని శాశ్వతంగా పారదొలేందుకు చర్యలు చేపడుతుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మద్య నియంత్రణ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల టైమింగ్స్ కూడా తగ్గించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహించాలి. ఈ విధానం ఆదివారం నుంచి అమలులో రానుంది. 

 

Leave a Comment