పవన్ కు అండగా చిరు.. చిరు రీ ఎంట్రీపై రాజకీయ వర్గాల్లో చర్చ..!

జనసేన క్రీయాశీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని, పవన్ కు చిరు అండగా ఉంటానని హామీ ఇచ్చారని నాదెండ్ల తెలిపారు. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మరాయి. చిరంజీవి రీ ఎంట్రీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ఉద్దేశంతో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై చర్చ నడుస్తోంది. అయితే పవన్ కి చిరు నైతిక మద్దతు ఉంటుందా? లేక పార్టీలోనూ చేరతారా? తిరుపతి అభ్యర్థికి ప్రచారం చేస్తారా? తమ్ముడి వెనకుండి నడిపిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. 

వైసీపీ ప్రభుత్వంపై మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకొండని ప్రభుత్వం బెదిరిస్తుందని ఆరోపించారు. జనసేన ఏకగ్రీవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. 

Leave a Comment