రేప్ చేయిస్తా.. కన్న కూతురికి తండ్రి బెదిరింపు..!

ఓ తండ్రి తన కన్న కూతురిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను రేప్ చేయిస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తన తల్లి పేరుతో హైదరాబాద్ లో కొంత ఆస్తి ఉండగా దానికి సంబంధించి నెల నెలా అద్దె వస్తుంటుంది. అయితే ఆ అద్దెను యువతి తండ్రి వసూలు చేసుకుని వినియోగించుకుంటున్నాడు. 

దీనిపై తండ్రిని ప్రశ్నిస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, లేదంటే రేప్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఇలా ప్రవర్తించేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. 

Leave a Comment