ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్ చేసిందా?

టీమిండియా – ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న టెస్ట్ లో బాల్ టాంపరింగ్ కలకలం రేపుతోంది. నాలుగో రోజు సెకండ్ సెషన్ లో ఇంగ్లండ్ ఫీల్డర్లు షూ స్పైక్ లతో బంతి లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వీడియో, ఫొటోలు కనిపించాయి. అయితే ఆ వీడియో, ఫొటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది. 

బాల్ ను ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ, బూట్ల స్పైక్స్ తో అదిమి తొక్కుతూ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో భారత అభిమానులు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్ కు పాల్పడిన ఇంగ్లండ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఐసీసీ స్పందిస్తుందో చూడాలి. 

Leave a Comment