మీరు రోజూ పాలు తాగుతారా? అయితే ఇది తెలుసుకోండి.. ఆరోగ్యానికి చాలా మంచిది..!

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా బలవర్ధకమైన ఆహారం.. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది ప్రతి రోజు పాలు తాగుతుంటారు. అయితే కొందరు వేడి వేడి పాలు తాగడానికి ఇష్టపడితే, మరి కొందరు గోరువెచ్చని లేదా చల్లని పాలు తాగడానికి ఇష్టపడతారు. అసలు ఆరోగ్యానికి వేడి పాలు తాగితే మంచిదా? చల్లటి పాలు తాగితే మంచిదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వేడి పాలు తాగిన, చల్లటి పాలు తాగినా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. కొందరికి అసలు పాలు అంటేనే ఇష్టం ఉండదు. అయితే రోజులో ఒక గ్లాస్ పాలు అయినా తాగే వాళ్లలో ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఎండాకాలంలో చల్లటి పాలు తాగడం వల్ల ఒంట్లో వేడి నెమ్మదిస్తుంది. చాలి కాలంలో రాత్రిపూట వేడి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. వేడి పాలు చాలా తేలికగా జీర్ణమవుతుంది. గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్రకు కారణం అవుతుంది. 

 

చల్లటి పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎసిడిటీ కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు చల్లని పాలు తాగకూడదు. అలా తాగడం వల్ల కొన్ని సార్లు జీర్ణ సమస్యలతో పాటు జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

అయితే ఏదీ కూడా ఎక్కువ తాగకూడదు. పాలను కూడా ఎక్కువగా తాగితే హార్మోనల్ బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్, మొటిమలు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. పాలు మాత్రమే తాగినట్లయితే రోజు మొత్తంలో 250 ఎంెల్ మోతాదులో తాగవచ్చు. అదే పెరుగు, నెయ్యి, పన్నీర్ వంటి పాల సంబంధిత ఉత్పత్తులను కూడా రోజూ తీసుకునేలా అయితే మాత్రం 100 నుంచి 150 ఎంఎల్ పాలను తీసుకుంటే సరిపోతుంది. 

Leave a Comment