ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ నాయకుడిగా మారిపోయాడు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇటీవల పలు రాష్ట్రాల నేతలతోనూ భేటీ అయ్యారు. ఈక్రమంలో ప్రధాన మంత్రి మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కి నేత కేసీఆర్.. తెలంగాణ సీఎం కేసీఆర్ జీ.. ఉత్తరప్రదేశ్ ఆప్ కో హార్థిక్ స్వాగత్ కర్తా హై’ అంటూ వారణాసిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కి లభిస్తున్న ఆదరణతో ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.. ఇటీవల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈసారి ఏకంగా మోడీ ఇలాకాలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వారణాసిలో తెలంగాణ మ్యాప్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ డ్రాప్ లో కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఒడిషాసీఎం నవీన్ పట్నాయక్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, తేజస్వీ యాద్, ప్రకాశ్ రాజ్, మాజీ ప్రధాని దేవేగౌడ ఫొటోలతో పాటు పలువురు నేతల ఫొటోలు ఉన్నాయి..

 

Leave a Comment