ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు..!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్విహించారు. ఈ సమీక్షలో ఆయన కర్ఫ్యూ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందని, కర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. కర్ఫ్యూను మరింత టైట్ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారిని  ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Leave a Comment