Black Fungus: ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చిన ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ కు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని ఆళ్ల నాని వెల్లడించార. 

 కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఒంటరైన పిల్లలు అనాథలు కాకుండా తక్షణ సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నారన్నారు.  

ఆక్సిజన్ కాన్ సంట్రేటర్స్ కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా పెట్టాలని, తద్వారా ఆస్పత్రుల మీద పడే భారం కొంతైనా తగ్గుతుందని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. పాజిటివ్ పేషెంట్లకు సంబంధించిన కుటుంబీలకు కరోనా లక్షణాలు ఉంటే వారికి తక్షన చికిత్స అందించాలనే లక్ష్యంగా ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు. సర్వేలో వచ్చిన కేసులకు సంబంధించి డాక్టర్ల సూచనల మేరకు హొం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లకు, ఆస్పత్రులకు పంపించడం జరుగుతుందని ఆళ్ల నాని వెల్లడించారు. 

Leave a Comment