నెల్లూరులో మూగ జీవాలకు పెళ్లి విందు.. కొత్త జంట వినూత్న ఆలోచన..!

పెళ్లి అంటేనే ఫుల్ హడావుడి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కోలాహలంగా ఉంటుంది. ఇక విందు గురించి చెప్పనక్కర్లేదు. ఎవరి హోదాకు తగ్గట్లు వారు విందు ఏర్పాటు చేసుకుంటారు. అతిథులకు రకరకాల వంటకాలు వడ్డిస్తారు.. కానీ కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరిమిత సంఖ్యలో జనం.. తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 

ఈనేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. పెళ్లి సందర్భంగా మూగ జీవాలకు పెళ్లి విందును ఏర్పాటు చేసి.. మూగ జీవాలపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఉత్తర భారతదేశానికి చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో స్థిరపడింది. వారి కుటుంబంలో నిఖిల్ – రక్షల పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు నెల్లూరులోని జంతు సంరక్షణ శాలలో మూగ జీవాలకు రూ.65 వేలతో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణ శాలలో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. వాటికి పెళ్లి విందు ఏర్పాటు చేసి మూగ జీవాలపై తమ ప్రేమను చాటుకున్నారు. 

Leave a Comment