గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటనలో 10 మంది వరకు  వరకు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు విశాఖలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వీరిని సీఎం జగన్ పరమార్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఉపయోగించుకుంటున్న ముడిపదార్థం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల గ్యాస్‌ లీకైందని చెప్పారు. గ్యాస్ లీక్ దుర్ఘటన దురదృష్టకరమని, జరిగిన ప్రమాదానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

తెల్లవారు జామున ఘటన జరిగినప్పుడు ప్రమాద హెచ్చరిక ఎందుకు రాలేదని, హెచ్చరికలు లేకపోవడం అన్నది దృష్టి పెట్టాల్సిన అంశమని చెప్పారు. కమిాటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తున్నటలు ప్రకటించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్న వారందరికీ రూ. 25వేలు, అస్వస్ధతతో ఆస్పత్రుల్లో కనీసం రెండు, మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉన్న వారందరికీ కూడా రూ. 1 లక్ష  పరిహారం ఇస్తున్నామని తెలిపనారు. తీవ్ర అస్వస్ధతకు గురై వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నవారికి రూ.10లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. :

గ్యాస్‌ కారణంగా ప్రభావిత గ్రామాలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ గ్రామాల్లోని దాదాపు 15 వేల మందికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. మెడికల్‌క్యాంపులు పెట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పశువులకు రూ.20 చొప్పున ఇవ్వాలన్నారు. 

 

Leave a Comment