ఉచిత బీమా అందించే  పాలసీల గురించి మీకు తెలుసా? లేకపోతే వెంటనే తెలుసుకోండి..

మీరు ఉచిత బీమా పాలసీ పొందలనుకుంటున్నారా? అయితే మీరు ఇవి తప్పక తెలుసుకోవాలి. ఒక వ్యక్తి డబ్బు సంపాదించేటప్పుడు మొదటగా తనకు మరియు తన కుటుంబానికి భద్రత ఇచ్చేందుకు బీమా చేసుకోవాలి. ఆ వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో లేదా ఆకస్మిక సంఘటన సమయంలో తనకు, తన కుటుంబానికి ఈ బీమా అనేది ఉపయోగపడుతుంది. అయితే మీకు ఉచితంగా బీమా పాలసీని అందించే ఈ ఐదు ఉత్పత్తుల గురించి మీరు తెలుసుకోవాలి. 

ఉచిత జీవిత బీమా పాలసీ ప్రణాళికలు..

PF ఖాతాదారులకు బీమా

EPFO లేదా PFO పీఎఫ్ ఖాతాదారులకు ఉచిత జీవిత బీమా పాలసీని అందిస్తుంది. పీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత ఇపీఎఫ్ఓ చందాదారులు EDLI 1976 నిబంధన ప్రకారం ఉచితంగా బీమా చేయబడతారు.

ఈ బీమా దావాలను EPFO చందాదారుల నామినీ దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం లేదా సాధారణ మరణం సమయంలో చేయవచ్చు. ఈ స్కీంలో రూ.6 లక్షల వరకు లైఫ్ కవర్ పొందచ్చు. అయితే EDLI కింద లైఫ్ కవర్ దావా వేసిన నామినీకి ఒకసారి ఇవ్వబడుతుంది. 

ప్రధాన మంత్రి జన్ ధన్ (PMJDY) ఖాతాదారులకు..

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద, జన్ ధన్ ఖాతాదారునికి రూపే డెబిట్ కార్డ్ మరియు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అందించబడుతుంది. PMJDY లబ్ధిదారులకు రూ.2లక్షలు బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే  అదనంగా రూ.30 వేలు బీమా లభిస్తుంది. ఈ బీమా కోసం ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 

డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డుపై బీమా..

క్రెడిట్ కార్డు హోల్డర్స్ రూ.50 లక్షల ప్రమాద బీమా పొందచ్చు. అయితే ఇది క్రెడిట్ కార్డ్ రకం మరియు దాని సర్వీస్ ప్రొవైడర్ మీద ఆధారపడి ఉంటుంది. భారతీయ బ్యాంకులు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమాను ఇస్తాయి.

అయితే బ్యాంక్ ఖాతాదారుడు ఏ రకమైన కార్డును ఉపయోస్తున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు రెండూ పనిచేస్తు ఉండాలి. కార్డు దారుల నామినీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు హోల్డర్ ప్రమాదవశాత్తు మరణిస్తే..మరణించిన 90 రోజుల లోపు క్లెయిమ్ చేయవచ్చు. 

LPG సిలిండర్ కనెక్షన్ కోసం జీవిత బీమా..

LPG గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారు ప్రమాద బీమాక అర్హులని మీకు తెలుసా? ఇది నిజం. LPG సిలిండర్ లీక్ లేదా సిలిండర్ పేలుడు వల్ల సంభవించిన అగ్ని ప్రమాదం కింద రూ.50 లక్షల లైఫ్ కవర్ పొందవచ్చు.

LPG సిలిండర్ ప్రమాద బీమా నిబంధనల ప్రకారం, హౌస్ హోల్డ్ డ్యామేజ్ పై రూ.2లక్షల వరకు, మరణానికి రూ.6 లక్షల వరకు బీమా లభిస్తుంది. హాస్పిటలైజేషన్ దావాకు రూ.2లక్షల వరకు పొందవచ్చు. దీనికి అదనంగా రూ.30 లక్షల వరకు హాస్పిటలైజేషన్ క్లెయిమ్ కూడా ఇవ్వబడుతుంది. 

మొబైల్ రీఛార్జ్ పై ..

మొబైల్ రీచార్జ్ పై కూడా లైఫ్ కవర్ పొందవచ్చు. అయితే పరిమిత మొబైల్ ఆపరేటర్లు మాత్రమే వీటిని అందిస్తాయి. వీటిలో ఎయిర్ టెల్ ఒకటి. మీరు ఎయిర్ టెల్ కస్టమర్ అయితే రూ.179 ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ కింద రూ.27 లక్షలకు, రూ.4లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, రూ.2లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ చేయవచ్చు.

ఈ ప్రయోజనం పొందడానికి ఈ కస్టమర్లు ఎయిర్ టెల్ రీఛార్జ్ తర్వాత ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా లేదా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లైఫ్ కవర్ ప్లాన్ కింద నమోదు చేసుకోవాలి. 

 

Leave a Comment