నీ ఆటకు సెల్యూట్.. అప్పుడే పుట్టిన కూతురు చనిపోయినా.. బాధను దిగమింగి సెంచరీ కొట్టాడు..!

జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా.. అధికమించి విజయం సాధించిన వారే నిజమైన హీరోలు.. అలాంటి ఓ సవాల్ బరోడా క్రికెటర్ విష్ణు సోలంకికి ఎదురైంది.. కన్న కూతురు కూతురు చనిపోయానా.. ఆ బాధను దిగమింగి సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్ లో చంఢీఘర్ తో జరిగుతున్న మ్యాచ్ లో ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో ఈ క్రికెటర్ స్ఫూర్తికి క్రికెట్ అభిమానులు సలాం చేస్తున్నారు…

విష్ణు సోలంకి విషాధగాథ ఏంటో చూద్దాం.. సోలంకీకి కొన్ని రోజుల క్రితం కూతురు పుట్టింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ చిన్నారి చనిపోయింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న విష్ణు వెంటనే బయలుదేరి కూతురు అంత్యక్రియలు చేశాడు. 

ఆ బాధను దిగమించుకొని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. వస్తూనే చండీఘర్ తో మ్యాచ్ లో శతకం బాదేశాడు సోలంకి.. ఈ మ్యాచ్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన బరోడా ఆల్ రౌండర్ 161 బంతుల్లో సెంచరీ చేశాడు. కూతురు చనిపోయినా ఆ బాధను దిగమింగి సెంచరీ చేసిన విష్ణు సోలంకిని అందరు మెచ్చుకుంటున్నారు. సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలాం అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

 

  

Leave a Comment