మాస్క్ పెట్టుకోవడం ఇంత కష్టమా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుంటున్నారు. అయితే మాస్క్ పెట్టుకోవడంలో ఎవరికీ అంత ఇబ్బంది ఉండదు. చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్ గా మాస్క్ పెట్టుకుంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం మాస్క్ పెట్టుకోవడం ఎంతో కష్టమైంది. అదేంటీ మాస్క్ పెట్టుకోవడంలో ఏం ఇబ్బంది ఉందని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వీడియో చూస్తూ మీకే అర్థమవుతుంది..

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గోరఖ్ పూర్ లో శివసేనా ఓ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉన్న ఓ కార్యకర్త మాస్క్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 

మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడు. ఒకసారి ముఖానికి ముక్కుపైకి పెట్టుకుని మళ్లీ తీసేశాడు. చివరికి చెవులకు పెట్టుకున్నాడు. అయితే అది చెవులకు పెట్టుకునే మాస్క్ కాదేమో అని మళ్లీ తీశాడు. ఇలా మాస్క్ పెట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినప్పుటికీ మాస్క్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాలేదు. చివరికి తన ముందు ఉన్న మరో కార్యకర్త సహాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పినట్లు చేసి మాస్క్ ను సరిగ్గా పెట్టుకున్నాడు. అలా మాస్క్ పెట్టుకునేందుకు ఆ వ్యక్తి దాదాపు రెండు నిమిషాలు సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఆలస్యం ఎందుకూ మీరు చూసి నవ్వుకోండి..  

Leave a Comment