ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన క్రికెటర్..!

కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా చాలా క్రికెట్ టోర్నీలు వాయిదాపడ్డాయి. దీంతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు నష్టాలు వచ్చాయి. దీంతో చిన్న, పెద్ద లేకుండా క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్ల ఫీజుల్లో కోతలు పెట్టాయి. దీంతో చిన్న క్రికెట్ బోర్డుల ఆటగాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 కరోనా లేకపోతే ఇప్పటికే టీ20 వరల్డ్ పక్ జరాగాల్సి ఉండేది. కానీ కరోనా కారణంగా అది కూడా వాయిదా పడింది. టీ20 వరల్డ్ కప్ ను గుర్తు చేస్తూ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఆదివారం ఓ ట్వీట్ చేసింది. ఈ రోజు టీ20 ఫైనల్ జరగాల్సి ఉండేది అని తెలుపుతూ కప్ ఫొటోలు జత చేసి షేర్ చేసింది. 

ఈ ట్వీట్ కు నెదర్లాండ్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరన్ స్పందించాడు. ‘మేము క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ నేను ఇప్పుడు ఊబర్ ఈట్స్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నా. పరిస్థితులు చాలా మారిపోయాయో తలుచుకుంటుంటే నవ్వొస్తోంది. నవ్వుతూ ముందుకు సాగండి’ అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

Leave a Comment