అపోలో ఆస్పత్రిపై కోవిడ్ రోగి బంధువుల దాడి..!

ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అపోలో ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. 

ఆస్పత్రిలోకి వెళ్లి డాక్టర్లు, నర్సులను కర్రలతో చితకబాదారు. అంతేకాదు. ఆస్పత్రి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. భవనం అద్దాలను పగులగొట్టారు. మరోవైపు కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసింది. 

కోవిడ్ తో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చారని, వెంటనే ఆమెకు చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. అయితే, ఐసీయూలో బెడ్స్ కొరతో ఆలస్యమైందన్నారు. ఇంతలోనే ఆమె మరణించిందని తెలిపారు. దీంతో ఆమె బంధువులు తమ వైద్య సిబ్బందిపై దాడికి దిగారని, హాస్పిటల్ ఆస్తులకు నష్టం కలిగించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Leave a Comment